సింగంతో మళ్లీ...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 January 2016
ఆమధ్య అగ్ర చిత్రాలలో నటించి అలసిపోయానని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెళ్లిన అనుష్క మళ్లీ వచ్చింది. తాజాగా నాగార్జున కథానాయకుడిగా విడుదల కానున్న సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో కూడా ఆమె కనిపించనున్నదని టాలీవుడ్ సమాచారం. అయితే మనం చిత్రం అఖిల్ తెరంగేట్రం గురించి రహస్యంగా వుంచిన సినిమా యూనిట్, ఈ చిత్రంలో అనుష్క ఎంట్రీ కూడా రహస్యంగా వుంచుతున్నారని తెలుస్తోంది. ఒక్కసారిగా తెరపై అనుష్క కన్పిస్తే ఆ కిక్కే వేరుగా వుంటుందని యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని ‘సింగం-3’ చిత్రంలో నటిస్తోంది అనుష్క. ఈ చిత్రానికి ‘ఎస్-3’ అనే పేరును పెట్టారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగానే మళ్లీ నటిస్తోంది అనుష్క.