నా హృదయం ఊగిసలాడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావంత్, పావని జంటగా కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, మనసులో ప్రేమ వుంటే దాన్ని మనసుతోనే చూడాలని, అలా చేస్తే దూరమైన మనషులను దగ్గర చేస్తుందనే కథనంతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని, ప్రేమను గెలిచేందుకు కావలసిన మనుషులను ప్రేమ తోడుగా అందిస్తుందన్న కథనంతో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. వైజాగ్, చీరాల తదితర ప్రాంతాలలో సింగిల్ షెడ్యూల్‌లో టాకీ పార్ట్ పూర్తిచేసి గోవా, అరకు ప్రాంతాలలో పాటల చిత్రీకరణ జరుపుతామని ఆయన తెలిపారు.
ఈ చిత్రానికి మాటలు:శ్రీనివాసరావు కిలారి, పాటలు:కాంచనపల్లి రాజేంద్రరాజు, ఎం.రామారావు, వి.ఎస్.ప్రభాకర్, సంగీతం:రాజ్‌కిరణ్, ఎడిటింగ్:హనుమంతు, నిర్మాత:పళ్లా రమణయాదవ్, కథ, స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం:్ధనుంజయ్.