జోరుమీదున్న రకుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రకుల్‌ప్రీత్‌సింగ్ టాలీవుడ్‌లో ఒకప్పుడు సమంత, కాజల్‌లు ఎలా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోయారో అలా ఇప్పుడు ఆమె కూడా హీరోయిన్‌గా మంచి ఆఫర్స్ పట్టేసి దూసుకుపోతోంది. తెలుగులో స్టార్ హీరోల చిత్రాలతోనే కాకుండా చిన్న హీరోల సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా గడుపుతోంది. ఆమె సాయి ధరమ్ తేజ్ పక్కన నటించిన ‘విన్నర్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. మరోప్రక్క సూపర్‌స్టార్ మహేష్ పక్కన నటిస్తోంది. అయితే రకుల్ ఇప్పటివరకూ నటించిన సినిమాలు ఏమీ ఆమెని టాప్‌లో కూర్చోబెట్టే సినిమాలు కావు. అన్ని యావరేజ్ హిట్స్ మాత్రమే. కెరీర్‌లో చెప్పుకోలేని సూపర్‌హిట్స్ లేకపోయినా కూడా ఆమె వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. ఇక టాలీవుడ్‌లో ఒకపక్క దునే్నస్తూనే ఇప్పుడు తమిళ్‌లో కూడా తన హవా కొనసాగించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే తమిళ హీరో కార్తీ పక్కన, కార్తి అన్నయ్య సూర్య పక్కన కూడా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. సూర్య, సెల్వరాఘవన్ డైరెక్షన్‌లో ఒక సినిమాలో నటించాల్సి వుంది. ఇక ఈ సినిమాలో సూర్యకి జోడీగా రకుల్‌ప్రీత్ అయితే బావుంటుందని ఆమెని సంప్రదించగా, ఆమె ఈ ఆఫర్‌ని ఓకె చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే సూర్య ప్రస్తుతం విజ్ఞేశ్ శివన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తవ్వగానే సెల్వరాఘవన్ సినిమాకి షిప్ట్ అవుతాడని సమాచారం. మరి రకుల్, సూర్య ప్రక్కన కూడా నటించి ఇటు తెలుగులో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోయినట్లే అటు తమిళంలో కూడా దూసుకుపోతోందని అంటున్నారు.