విన్నర్‌గా నిలబెట్టే సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ‘విన్నర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు గోపీచంద్ మలినేని. ‘డాన్ శీను, ‘బలుపు’ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆయనకు రామ్ నటించిన ‘పండగ చేస్కో’ కాస్త నిరాశపరిచింది. దాంతో కొంత గ్యాప్ తీసుకుని మెగా మేనల్లుడుతో చేస్తున్న చిత్రం ‘విన్నర్’. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో మాటామంతీ...
* ‘విన్నర్’ ఎలా ఉంటాడు?
- ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. మంచి యాక్షన్ సన్నివేశాలు, కామెడీతోపాటు కదిలించే ఎమోషన్ కూడా వుంటుంది. అది ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్టవుతుంది. సినిమా మొదలైన దగ్గర్నుంచి ఎండింగ్ వరకు చాలా ఎగ్జైటింగ్‌గా సాగుతుంది. చివరి 15-20 నిమిషాల రేసింగ్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుంది.
* హీరో ధరమ్ తేజ్ గురించి?
- తేజ్‌లో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ. యాక్షన్ సీక్వెన్స్‌లు, డాన్సులు, హార్స్ రేస్ వంటి వాటిలో చాలా బాగా నటించాడు. అతని కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎమోషన్ సీన్లలో అద్భుతంగా నటించాడు. ఈ చిత్రం హీరోగా అతని స్థాయిని పెంచే చిత్రమవుతుంది. టైటిల్ ‘విన్నర్’. అంటే హీరో విన్నర్ అవడానికి ఎలాంటి జర్నీ చేశాడు. ఆ జర్నీలో అతను పడ్డ కష్టాలేంటి? కిందపడి మళ్లీ విన్నర్‌గా మారడానికి ఏం చేశాడు అన్నది అసలు కథ.
* హీరోకి గుర్రపు స్వారీ నేర్పించారా?
- ఈ సినిమాలో హీరోకి గుర్రాలన్నా, రేసులన్నా, తండ్రన్నా అస్సలు పడదు. అలాంటి హీరో చివరకు తండ్రికోసం, ప్రేమకోసం ఎలాంటి పోరాటం చేస్తాడు అనేదే నేపథ్యం. తేజ్ తండ్రిగా జగపతిబాబు నటించారు. వాళ్లిద్దరికీ మధ్య వచ్చే సీన్లు చాలా ఎమోషనల్‌గా వుంటాయి. రేసింగ్ సీక్వెనె్సస్ అన్నీ టర్కీలో షూట్ చేశాం. అక్కడ గుర్రాలు చాలా పవర్‌ఫుల్‌గా వుంటాయి. మొత్తం పది గుర్రాల్ని ఫైనల్ రేస్‌లో వాడాం. సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ దీనికోసం పనిచేశారు. ఆయన గతంలో ‘గ్లాడియేటర్’, ‘్ఫస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘ట్రాయ్’ సినిమాలకి పనిచేశారు. ఆ గుర్రాలతో పనిచేయడం చాలా రిస్క్. ముఖ్యంగా తేజ్ వాడిన గుర్రానికి సుమారు 20 సంవత్సరాల అనుభవం వుంది. చాలా హాలీవుడ్ సినిమాల్లో నటించింది. వెల్ ట్రైన్డ్ హార్స్. యాక్షన్ అంటే పరిగెడుతుంది, కట్ చెప్తే ఆగిపోతుంది. మా యాక్షన్ కొరియోగ్రాఫర్ చాలా జాగ్రత్తగా తేజ్‌కు ఎలాంటి ప్రమాదం జరుగకుండా చూసుకున్నాడు.
* హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించి?
- రకుల్‌తో పనిచేయడం ఇది రెండోసారి. ఆమె చాలా డెడికేటివ్‌గా వర్క్ చేస్తుంది. అనుష్క ఎంతటి అంకితభావంతో పనిచేస్తారో రకుల్ కూడా అలాగే పనిచేస్తుంది. ఈ సినిమాలో ఆమె ఒక అథ్లెట్‌గా కనిపిస్తుంది. ఎప్పటికైనా రన్నింగ్ రేస్‌లో మెడల్ సంపాదించాలని అనుకునే పాత్ర. సాధారణంగా రకుల్‌కు ఫిట్‌నెస్ మీద ఎక్కువ శ్రద్ధ కనుక ఈ పాత్రలో సులభంగా ఇమిడిపోయింది.
* కామెడీ ఎక్కువగా ఉన్నట్టుంది?
- ఇందులో కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగుంటుంది. ‘సింగం సుజాత’ పాత్రలో పృధ్వీ, పీటర్ హేన్స్ క్యారెక్టర్లో అలీ, హీరో ఫ్రెండ్ పద్మగా వెనె్నల కిశోర్‌ల కామెడీ బాగా నవ్విస్తుంది. ఎక్కడెక్కడ కామెడీ వుండాలో అక్కడ ఉండేలా చూసుకున్నాం.
* ఈమధ్య మీకు బాగా గ్యాప్ వచ్చింది?
- ఒక సినిమా చేస్తుండగా ఇంకో సినిమా చేయడం నాకు నచ్చదు. ఒక సినిమాపైనే దృష్టి పెడతాను. మనల్ని నమ్మి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చాలా డబ్బు పెడతారు. వాళ్లకు లాభాలు వచ్చేలా చూడాలి. సినిమా ఫ్లాప్ కాకూడదని ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా మొదలుపెడతాను. కథ వర్కౌట్ అవుతుందని అనిపిస్తేనే టేకప్ చేస్తాను. అందుకే కాస్త ఆలస్యమవుతుంది.
* అనసూయతో స్పెషల్ సాంగ్, సుమతో పాడించడం గురించి?
- స్పెషల్ సాంగ్ అనుకున్నప్పుడు అనసూయ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎందుకంటే ఆమె టీవీ ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. కనుక అది ప్లస్ అవుంతుందని భావించి ఆమెను అడిగాం. మొదట ఆమె ఒప్పుకోలేదు. తర్వాత పాట విన్నాక చేస్తానన్నారు. ఇక సుమతో పాడించడం తమన్ ఐడియా. నేను కూడా సరే అన్నాను. పాట పూర్తయ్యాక వింటే ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినట్లు అనిపించింది.
* మీరు ఎందుకు స్టార్ హీరోలతో సినిమాలు చేయడంలేదు?
- తరువాతి సినిమా పెద్ద హీరోతోనే చేయాలని అనుకుంటున్నాను. రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సినిమా సాధించే విజయాన్ని బట్టే నా స్టెప్ వుంటుంది.

-శ్రీ