సుదీప్ ఒక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీప్, నిత్యామీనన్ జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కన్నడ, తమిళ భాషల్లో రూపొందించిన చిత్రం ‘కోటికొక్కడు’. సి.ఎల్.ఎన్. మీడియా పతాకంపై లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్‌రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- కన్నడ, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దాదాపు 120 కోట్లకుపైగా వసూలు చేసి ఇంకా ప్రదర్శింపబడుతోందని తెలిపారు. నిత్యామీనన్ నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రంలోని కథ వైవిధ్యంగా వుంటుందని, సుధీప్ కధానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఫైట్స్, డాన్స్ ప్రేక్షకులను అలరిస్తాయని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రకాష్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:రాజరత్నం, మాటలు:శశాంక్ వెనె్నలకంటి, పాటలు:్భవనచంద్ర, వెనె్నలకంటి, రాకేందు వౌళి, సంగీతం:డి.ఇమ్మాన్, ఎడిటింగ్:ప్రవీణ్ ఆంటోని, కథ:పి.శివకుమార్, నిర్మాత:కె.శిల్పిక, దర్శకత్వం:కె.ఎస్.రవికుమార్.