కామెడీ కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయనగానే కొద్దిగా టెన్షన్ పడినమాట నిజమే. కామెడీ చేయడం కష్టమేనని అర్థమైంది. కానీ, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ విజయంతో పూర్తి కాన్ఫిడెన్స్‌తో వున్నా’ అని కథానాయకుడు శర్వానంద్ తెలిపారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్, సురభి జంటగా రూపొందిన ఎక్స్‌ప్రెస్‌రాజా ఈనెల 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని చిత్ర విశేషాలను తెలిపారు ఆయన.

తీయనైన బాధ్యత
‘ఎక్స్‌ప్రెస్‌రాజా’ విజయం సాధించడం ఆనందంగా వున్నా, ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగిందని అనిపిస్తోంది. ఇది తీయగా వున్నా ముందు ముందు ఏ మాత్రం రుచి మారకుండా చూసుకోవాలి. ఈ సక్సెస్ ఇలాగే నిలబెట్టుకోవాలి. అన్ని కేంద్రాలనుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇటీవల దేవి థియేటర్‌కు వెళ్లి అభిమానులందరి చిత్రాన్ని చూడడం ఓ హ్యాపీ సన్నివేశం.
గుడ్డిగా నమ్మా
ఈ సినిమాలో నా పాత్ర ఈజీ గోయింగ్‌గా వుంటుంది. అందుకోసం ప్రత్యేకంగా ఏమీ పరిశోధనలాంటివి చేయలేదు. దర్శకుడు ఎలా చెబితే అలా గుడ్డిగా చేసుకుంటూ వెళ్లా. ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు, వెకిలి హాస్యాలు సినిమాలో లేవు. ఎలా వుండాలో అలాగే తీశాడు దర్శకుడు.
తప్పులు తెలుసుకున్నా
ఈ యు.వి.క్రియేషన్స్ నా స్వంత సంస్థలాంటిది. ‘రన్ రాజా రన్’తో కమర్షియల్ హిట్ అందించిన సంస్థ. ఇటువంటి సంస్థలో పనిచేయడం పెద్ద రిలీఫ్. సినిమా విడుదల గురించి ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిర్మాతగా నేను చిత్రాల విడుదల సమయంలో ఎటువంటి తప్పులు చేశానో వారిని చూసే తెలుసుకున్నా.
ప్లాన్ మారింది
‘రన్ రాజా రన్’ సినిమా తరువాత ప్రతి చిత్రం ఎంపికలో ఆచి తూచి అడుగువేయాల్సి వస్తోంది. నా ఆలోచనా విధానం కూడా మారింది. ప్రతి సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ వుండేలా చూసుకుంటున్నాను. అది సీరియస్ సినిమా అయినా సరే, ప్రేక్షకులకు కావలసింది ఇవ్వకపోతే చూడరు. అందుకే నా ఆలోచనా విధానానికి ప్రధాన కారణం సుజిత్, మేర్లపాక గాంధీలనే చెబుతాను.
కామెడీ కష్టమే
సీరియస్‌గా నడిచే చిత్రంలో కామెడీ చేయడం చాలా కష్టంతో కూడుకున్నదే. ఓ రకంగా అది కత్తిమీద సాము. అదే సీరియస్ చిత్రాలు అయితే, ఎలాగైనా చేయవచ్చు. ప్రస్తానం వంటి సినిమా మరోసారి చేయడానికి కూడా నేను సిద్ధమే. అందులో ఇబ్బందేం ఉండదు. కామెడీ చేయడమే చాలా కష్టమని అన్పిస్తోంది.
ఆది ట్రాష్
మొదటి సినిమా హిట్ అయ్యాక దర్శకుడి రెండో చిత్రం తప్పక ఫట్ అవుతుందన్న సెంటిమెంట్‌ను నేను పట్టించుకోను. అది ఒక ట్రాష్. కథాబలం బాగా వుంటే ఆ సినిమా తప్పక విజయవంతం అవుతుంది. ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిందని అతని ప్రతిభని తక్కువగా అంచనా వేయలేం. గాంధి ఈ చిత్రాన్ని ప్రతి పాత్రను చక్కగా డిజైన్ చేసిన తీరు నాకు నచ్చింది. పూర్తి కాన్ఫిడెన్స్‌తోనే సినిమాను అతను రూపొందించాడు.
ప్రభాస్, చరణ్
ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ మంచి మంచి సలహాలు ఇచ్చారు. అలాగే రామ్‌చరణ్ కూడా ట్రైలర్, పాటలు చూసి బాగున్నాయని చెప్పి నా డాన్సులను మెచ్చుకున్నాడు. సహజంగా ఇద్దరం కలిసినపుడు సినిమా గురించి మాట్లాడుకోకపోయినా సినిమా గురించో, దర్శకుల గురించో మాట్లాడుకుంటాం.
క్లారిటీ లేదు
అందరూ పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పట్లో మాత్రం పెళ్లిచేసుకునే ఆలోచన లేదు. నేను పెద్దవాళ్లు చెప్పిన అమ్మాయిని చేసుకుంటానా, నా ఇష్టమొచ్చినట్లుగా చేసుకుంటానా అనేది కూడా న నేను చెప్పలేను. దానికింకా సమయం వుంది. పెళ్లి విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదని నేననుకుంటున్నా. వస్తే ఖచ్చితంగా చెబుతాను.

-యు