మల్టీస్టారర్ తీస్తున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఖైదీ నెం.150’ చిత్రం విడుదల సందర్భంగా చిరంజీవికి సత్కార సభ ఏర్పాటు చేసి గ్రాండ్ పార్టీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి ఆ సమయంలో చిరంజీవి, మల్టీ స్టారర్ నిర్మిస్తానని ప్రకటించారు. అక్కడే ఉన్న చిరంజీవి కూడా సుబ్బరామిరెడ్డి మాటలకు సంఘీభావం తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్ల తమ కల నిజమవుతున్నందుకు మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకున్నంత పనిచేశారు. కానీ ఆ తర్వాత రెండుమూడు రోజులకు ఈ మెగా మల్టీస్టారర్ రూపుదిద్దుకోవడం కష్టమని వార్తలొచ్చాయి. పైగా యూఎస్ టూర్ వెళ్లిన పవన్ కూడా అన్నయ్యతో సినిమా విషయమై తననెవరూ సంప్రదించలేదని చెప్పడంతో ఇక మెగా మూవీ లేనట్టేనని ఫ్యాన్స్ నిరుత్సాహపడిపోయారు. కానీ తాజాగా మీడియాతో మాట్లాడిన సుబ్బరామిరెడ్డి ఈ సినిమా ఉంటుందని బల్లగుద్ది చెప్తున్నారు. అప్పడెప్పుడో ‘రౌడీషీటర్’ సినిమా తర్వాత మరో సినిమా నిర్మించని ఆయన తెలుగులో ఒకప్పటిలా మల్టీస్టారర్ సినిమాలు రావాలని ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే పవన్‌తో మాట్లాడానని, ఆయన సంతోషంగా ఒప్పకున్నాడని, వీరిద్దరినీ హ్యాండిల్ చేయగల దర్శకుడు త్రివిక్రమ్ అని భావించి మంచి కథను సిద్ధంచేసే పని ఆయనకు అప్పగించామని, నిర్మాణంలో తనకు సహాయంగా అశ్వినీదత్ ముందుకొచ్చారని, ఒకసారి చిరు, పవన్‌లు ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తిచేయగానే ఈ సినిమా మొదలవుతుందని అన్నారు. ఈ ప్రకటన అభిమానుల్లో మళ్ళీ పాత ఉత్సాహాన్ని నింపింది.