రాధ.. శర్వానంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శతమానం భవతి’ విజయంతో యువ కథానాయకుడు శర్వానంద్ తెచ్చుకున్న గుర్తింపు, ఆ తరువాత ఆయనకు అనేక అవకాశాలను తెచ్చిపెట్టింది. తాజాగా శర్వానంద్ కథానాయకుడిగా నూతన దర్శకుడు చంద్రమోహన్ నిర్దేశకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రానికి ‘రాధ’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- శర్వానంద్ ఇంతవరకూ చేయని ఓ వినోద భరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రంలో నటించారని, ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేశామని తెలిపారు. వేసవి కానుకగా ఉగాదికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్లలో వుండి క్లాస్, మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:రధన్, కెమెరా:కార్తీక్ ఘట్టమనేని, నిర్మాత:బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, దర్శకత్వం:చంద్రమోహన్.