దువ్వాడ జగన్నాథం ముద్దూముచ్చట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ కథానాయకుడిగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీశ్ శంకర్.ఎస్. దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందిస్తున్న చిత్రం ‘డి.జె.(దువ్వాడ జగన్నాథమ్). ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం విడుదలైంది. బ్రాహ్మణుడి గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించిన ఈ టీజర్‌లో కథానాయకి పూజాహెగ్డే ముద్దుపెట్టుకున్న సన్నివేశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ‘ఇలాఇలా ముద్దులు పెట్టేసి సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని’ అంటూ చెప్పిన డైలాగ్ అందరికీ నచ్చింది. టీజర్ మంచి ఆదరణ పొందుతోందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. తమ సంస్థ నుండి సినిమా అంటేనే ప్రేక్షకులలో భారీ అంచనాలు వుంటాయని, అలాగే అల్లు అర్జున్ తమ సంస్థలో చేస్తున్న హ్యాట్రిక్ మూవీగా డి.జె నిలుస్తుందని నిర్మాత తెలిపారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని, అలాగే నేడు విడుదల చేసిన టీజర్‌కు కూడా ప్రేక్షకులనుండి ట్రెమండస్ రెస్పాన్స్ లభించిందని తెలిపారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను ప్రెస్టేజియస్‌గా రూపొందించామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఐనాక బోస్, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్:చోటా కె.ప్రసాద్, స్క్రీన్‌ప్లే:రమేశ్‌రెడ్డి, దీపక్‌రాజ్, నిర్మాతలు:రాజు, శిరీష్, కథ, మాటలు, దర్శకత్వం:హరీశ్ శంకర్.ఎస్.