బిపాసా మారలేదుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో గ్లామర్‌తో సంచలనం రేపడంలో బిపాసాకు కొత్తేమీ కాదు. అప్పట్లోనే బికినీలతో ఘాటు ఫోజులిచ్చి షాకిచ్చిన ఈ భామ, అంతకుముందే లిప్‌లాక్‌లతోను అదరగొట్టింది. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో స్కిన్ షోలతో ఆకట్టుకున్న ఈ భామ ఈమధ్యే కరణ్‌సింగ్ గ్రోవర్‌ను పెళ్లిచేసుకుని ప్రస్తుతానికి సినిమాలకు దూరంగానే వుంటోంది. వరుస ఫ్లాప్‌లతో పెద్దగా అవకాశాలేవీ రాకపోవడంతో భర్తతో కలిసి వీకెండ్‌లు, విదేశాలు చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకను ముంబాయిలో ఘనంగా జరుపుకుంది. తన ఫ్రెండ్స్‌ని పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన ఈ అమ్మడు అందరికీ దిమ్మతిరిగేలా తన భర్త కరణ్‌సింగ్ గ్రోవర్‌కు ఘాటు లిప్‌లాక్ ఇచ్చి సంచలనం రేపింది. ఇప్పటికే ఈ వ్యవహారం బాలీవుడ్‌లో హల్‌చల్ అవుతోంది. కావాలనే ఇలా సంచలనం రేపేందుకే బిపాసా ఇలా చేసిందని గుసగుసలాడుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. ఇలాంటి సంచలనం రేపితేనే అవకాశాలు వస్తాయని అనుకుందేమో!