నిర్మాత కె.సి.శేఖర్‌బాబు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి కథానాయకుడిగా ‘ముఠామేస్ర్తీ’ ‘సర్దార్’, ‘పక్కింటి అమ్మాయి’, ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘సంసారబంధం’ ‘మమత’ తదితర చిత్రాలను రూపొందించిన నిర్మాత కె.సి.శేఖర్‌బాబు (71) హైదరాబాద్‌లోని తమ స్వగృహంలో శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. 1973లో నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన ఆయన చిరంజీవితో ‘ముఠామేస్ర్తీ’, బాలకృష్ణతో ‘సాహస సామ్రాట్’, కృష్ణంరాజుతో ‘జగ్గు’, ‘సర్దార్’ వంటి చిత్రాలను ఆయన రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ నిర్మాతగా గుర్తింపు పొందారు. చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పలు విధాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు. అనేమంది నిర్మాతలకు, దర్శకులకు సన్నిహితంగా వుండే ఆయన మరణం పట్ల పలువురు దిగ్భ్రాం తి వ్యక్తంచేశారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెన్నైలో వున్న కుమారుడు, అమెరికాలో వున్న కుమార్తె వచ్చాక రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు.
చిరంజీవి, అల్లు అరవింద్, అర్జున్, దర్శకుడు రాఘవేంద్రరావు, మురళీమోహన్, నిర్మాతలు సి.కల్యాణ్, అశ్వినీదత్, రఘురామరాజు తదితరులు ఆయన మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతో తమకు వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.