పాటల్లో వెళ్లిపోమాకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్వక్‌సేన్, సుప్రజ, శే్వత ముఖ్యపాత్రల్లో యాకుబ్ అలీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్న చిత్రం ‘వెళ్లిపోమాకే’. ఈ చిత్రంలోని పాటలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దర్శకుడు వేగేశ్న సతీష్ సీడీని ఆవిష్కరించారు. అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్ చూశాను. బాగా నచ్చింది. తరువాత సినిమా చూసి బాగా కనెక్ట్ అయ్యా. నేను తీసిన దిల్ చిత్రం విడుదలై మరో రెండు నెలలో 14 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ 14 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాను. మంచి సినిమాలు నిర్మిస్తానని ప్రశంసలూ దక్కాయి. నా ఇనే్నళ్ల అనుభవం ‘వెళ్లిపోమాకే’ వంటి సినిమాకి ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా వుంది. కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే ఆలోచనతోనే సినిమాలో భాగమయ్యాను. కొత్తగా సినిమాలు చేయాలనుకునేవారికి ఇదొక లైబ్రరీ అవుతుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు వుండరు. మన పక్కింటి అబ్బాయిలు, అమ్మాయిలే కనిపిస్తారు. తప్పకుండా ఇలాంటి మంచి ప్రయత్నాల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.. దర్శకుడు యాకుబ్ అలీ మాట్లాడుతూ- మంచి టీమ్‌తో సినిమా చేశామని, మాకెవరికీ పరిశ్రమతో సంబంధం లేకపోయినా చేశామని, కానీ ఈ సినిమా దిల్‌రాజుకు నచ్చుతుందని అనుకోలేదని, ఆయన సినిమా చూసి మెచ్చుకున్నారని అన్నారు. క్షణం, పెళ్లిచూపులు వంటి సినిమాల తరువాత చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతోందని న్నారు. హీరో విష్వక్‌సేన్ మాట్లాడుతూ- అనుపమ్‌ఖేర్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నానని,ఈ సినిమాకు దిల్‌రాజు సపోర్టు అందించడం మర్చిపోలేని అనుభూతి అన్నారు. వేగేశ్న సతీష్ మాట్లాడుతూ- కొత్తవాళ్ళందరూ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలి అన్నారు.