రాజుగారింట్లో .. సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజయ్, భరత్, అర్జున్, వెంకటేశ్, సుస్మిత ప్రధాన తారాగణంగా భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజా దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసారు. యు/ఎ సర్ట్ఫికెట్ లభించింది. ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో భరత్ మాట్లాడుతూ హారర్ కథా కథనాలతో వస్తున్న చిత్రాలన్నీ విజయాన్ని సాధిస్తున్నట్టుగానే ఈ చిత్రంకూడా ప్రేక్షకులకు నచ్చుతుందని, ట్రైలర్‌కు ఆదరణ లభిస్తోందని తెలిపారు. పాటలు హైలెట్‌గా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. క్రైమ్ ఆధారంగా రూపొందిన ఓ హారర్ చిత్రంగా ఉంటుందని స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగే ఈ చిత్రాన్ని ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు ఫిరోజ్ రాజా తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి.కె.కుమార్, సంగీతం: కనిష్క్, ఎడిటింగ్: అనిల్, రచన, దర్శకత్వం: ఫిరోజ్ రాజా.