పాటల్లో ఫాలో.. ఫాలోయూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీద్‌ఖాన్, సిరి, శీతల్ హీరో హీరోయిన్లుగా నజీమ్ దర్శకత్వంలో ఎ.వి.ఆర్.ఇంటర్నేషనల్, టీమ్‌వర్క్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘్ఫలో ఫాలోయూ’ చిత్ర ఆడియో లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని నిర్మాత సాయివెంకట్ ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు నజీమ్ మాట్లాడుతూ- ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీతో సినిమాను నిర్మించాం. మంచి కథతో చేసిన చిత్రమిది. సన్నీ అద్భుతమైన పాటలిచ్చాడు. ప్రేక్షకులకు నచ్చే అన్ని రకాల హంగులున్న చిత్రమిది అన్నారు. హీరో నవీద్‌ఖాన్ మాట్లాడుతూ- హీరోగా నా తొలి చిత్రం. దర్శకుడు నజీమ్ ఎంతో సపోర్టు అందించారు. హర్రర్, రొమాన్స్ కామెడీ అంశాలున్న చిత్రమిది అన్నారు. సాయివెంకట్ మాట్లాడుతూ- నవీద్ సినిమాలంటే ఫ్యాషన్ వున్న వ్యక్తి. ట్రైలర్ బాగుంది. ముఖ్యంగా సన్నీ మంచి పాటలిచ్చాడు. ఈ సినిమా విజయం సాధించి యూనిట్‌కు మంచి పేరు తేవాలి అన్నారు. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- సినిమాలో కంటెంట్ వుంటే కొత్తవాళ్లతో అయినా హిట్ సినిమాలు తీయొచ్చని చాలా సినిమాలు నిరూపించాయి. ఈ చిత్రంలో పాటలు బాగున్నాయి. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అన్నారు.