ప్రేమలో పడితే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎజిల్ దురై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘సెంజిత్తలే ఎన్‌కాదల’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమలో పడితే హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్‌అప్’ పేరుతో అనువదిస్తున్నారు నిర్మాత ఎస్.సుబ్రహ్మణ్యన్. మధుమిత, అభినయ హీరోయిన్లుగా నటించిన లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత సుబ్రహ్మణ్యన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ- ఎజిల్ దురై హీరోగా నటించిన చిత్రమిది. లవ్ కామెడీ ఎంటర్‌టైనర్ అన్ని అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి చిత్రీకరించాం. ముఖ్యంగా టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అనువాద కార్యక్రమాలు జరుపుతున్నాం. మాంగో మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.