సినిమా హిట్‌పైనే కెరీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త హీరో పరిచయం అయ్యాడు. కాదు.. అచ్చంగా మన పక్కింటి అబ్బాయి వచ్చాడా అనిపించాడు. ఆ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న రాజ్‌తరుణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ భిన్నమైన కథలతో ముందుకు సాగుతున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రం మార్చి 3న రిలీజ్ కానున్న సందర్భంగా రాజ్‌తరుణ్‌తో ఇంటర్వ్యూ..
* రిలీజ్ వచ్చేసింది టెన్షన్ పడుతున్నారా?
- లేదు. ఈమధ్యే సినిమా చూశాను. రిలీజ్‌పట్ల చాలా నమ్మకంగా ఉన్నాను. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రం ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండి ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతోపాటు మరో రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ పరీక్షల సీజన్‌లో రిలీజ్ చేయడం తరువాత లాభిస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అయినా అన్ని సినిమాలు బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది.
* మీ పాత్ర గురించి
- ఇందులో నాది కుక్కలను కిడ్నాప్ చేసే పాత్ర. అదే నా పని. చాలామంది తెలిసిన నటులు ముఖ్యమైన పాత్రలు చేశారు. ప్రతి రోల్ బలంగా ఉంటుంది. ప్రతి పాత్ర ఎవరి దృష్టిలో వాళ్ళు హీరోలని ఫీలవుతుంటారు. ఇందులో అర్బాజ్‌ఖాన్ విలన్ పాత్ర చేశారు. ఒక అరగంట ఆయనతో మాట్లాడితే 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటాం.
* హీరోయిన్‌తో లిప్‌లాక్ చేశారు?
- అది సినిమాలో రొమాంటిక్ యాంగిల్. కీలక సమయంలో వస్తుంది. దాని గురించి అంతగా మాట్లాడటానికి ఏం లేదు. అను ఇమ్మాన్యుయేల్ చాలా బాగా నటించింది. ఆమె సినిమాకు మంచి బోనస్ అవుతుంది.
* కుక్కలతో షూటింగ్ చేయడం ఎలా ఉంది?
- పర్సనల్‌గా కుక్కలంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో 13 కుక్కలుంటాయి. వాటితో పనిచేయడం చాలా బాగుంది. వాటి ద్వారా జనరేట్ అయ్యే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులను తప్పక మెప్పిస్తుంది.
* స్టార్‌గా మారారు, కెరీర్ ఎలా ఉంది?
- ఎవరైనా సరే మన ముందు సినిమాను బట్టే మనల్ని చూస్తారు. నేను అదే ఫార్ములాను నమ్ముతాను. ముందు సినిమా హిట్టయితేనే స్టార్ స్టేటస్ ఉంటుంది. నేను ఆ స్టేటస్ గురించి పెద్దగా పట్టించుకోను. నా నెక్స్ట్ సినిమాల మీదే దృష్టి పెడుతుంటాను.
* ఫెయిల్యూర్స్‌ని ఎలా తీసుకుంటారు?
- సినిమాలు రిలీజయ్యాక దాని గురించి ఆలోచించను. మనం మార్చలేని వాటి గురించి ఎంత ఆలోచించినా అది వృథానే. అందుకే తరవాతి సినిమాలేమిటనేది చూసుకుంటూ వెళ్తా.
* మీపై రకరకాల వార్తలు వస్తున్నాయి, దాని గురించి?
- నాకు బాగా గుర్తు. కుమారి 21ఎఫ్ ఇంటర్వ్యూకి చాలా లేట్‌గా వెళ్లాను. అప్పటి నుండి నేను యారోగెంట్ అని, క్రమశిక్షణ లేనివాడినని వార్తలొచ్చాయి. ఆ రోజు లేటుగా వెళ్లడం నా చేతుల్లో లేదు. తర్వాత లాస్య విషయంలో కూడా అదే జరిగింది. ట్విట్టర్ ద్వారా వాటిని క్లియర్ చేద్దామని అనుకున్నా. కానీ అప్పటికే ఆలస్యమైంది. అందుకే వాటి గురించి ఎక్కడా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా.
* మీ నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటి?
- ఈ సినిమా తర్వాత ‘అందగాడు’ కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. అది కాకుండా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నాను. ఈ సినిమాని రంజని అనే లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు. అవి పూర్తవగానే దిల్‌రాజుతో సినిమా ఉంటుంది.

-శ్రీ