ఇషాన్ పెద్ద స్టార్ అవుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తన్వి ఫిలింస్ పతాకంపై సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న చిత్రం ‘రోగ్’. మన్నారా చోప్రా, ఏంజెలినా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత సి.ఆర్.మనోహర్ ట్రైలర్‌ను విడుదల చేయగా, కన్నడ ట్రైలర్‌ను నటుడు ఆలీ విడుదల చేశారు. అనంతరం నిర్మాత సి.ఆర్.మనోహర్ మాట్లాడుతూ- మా బ్రదర్‌ని హీరోగా లాంచ్ చేయాలని పూరి జగన్నాధ్‌ని అడిగినపుడు ఆయన ఓకె చెప్పి సాయంత్రం రండి, కథ చెబుతాను అన్నారు. ఆ రోజునుంచి ఇషాన్‌ను ఆయనకు అప్పగించాం. స్వంత బిడ్డలా కేర్ తీసుకుని ఈ సినిమా చేశాడు. సినిమా ట్రైలర్ చూసుకున్న తరువాత చాలా ఆనందమేసింది. ‘రోగ్’ సినిమాతో ఇషాన్ మంచి నటుడిగా గుర్తుండిపోతాడు. అలాగే సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ అందించాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పూరి జగన్నాధ్‌కు నా ధన్యవాదాలు. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఇషాన్‌ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానన్నారు. హీరోయిన్ ఏంజిలినా మాట్లాడుతూ- పూరి పరిచయం చేసిన హీరోయిన్లు అందరూ మంచి పొజిషన్‌లో వున్నారు. ఆయన డైరెక్షన్‌లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. పూరి జగన్నాధ్ మాట్లాడుతూ- చాలా రోజుల తరువాత మంచి ప్రేమకథ చేశాను. ఈ సినిమా కంటే ఎక్కువగా నేను ఇషాన్‌ను చూసి ఎగ్జైట్ అయ్యాను. మంచి హైట్, పర్సనాలిటీతో స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మనోహర్ లాంటి బ్రదర్ వుండడం ఇషాన్ అదృష్టం. ఫస్ట్ డేలో రొమాంటిక్ సాంగ్స్ తీసేటప్పుడు చాలా వణికిపోయాడు. ఆ తరువాత రోజునుంచీ పాత్రలో ఇన్‌వాల్వ్ అయి చక్కగా నటించాడు. తప్పకుండా ఫ్యూచర్‌లో స్టార్ హీరోగా నిలబడతాడు అన్నారు. హీరో ఇషాన్ మాట్లాడుతూ- ఈరోజు నేనిక్కడ నిలబడడానికి కారణమైన మా అమ్మా, నాన్న, ముఖ్యంగా పెదనాన్న కారణం. మాది జాయింట్ ఫ్యామిలీ. నాకు ఫ్యామిలీతో ఎక్కువ అటాచ్‌మెంట్ వుంది. ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సపోర్టు అందించారు. మా అన్నయ్య మనోహర్ లేకపోతే నేను లేను. వైజాగ్‌లో సత్యానంద్ దగ్గిర నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆ రోజు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఈ రోజు పూరి దర్శకత్వంలో పరిచయమయ్యే అవకాశం దక్కింది. ఆయన ఎంతో బాగా చూసుకున్నారు. ఆయనకు జన్మంతా రుణపడి వుంటాను అన్నారు.