చిత్రాంగద వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు హీరోయిన్ అంజలి ముఖ్యపాత్రలో, తెలుగు, తమిళ భాషల్లో అశోక్ దర్శకత్వంలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డేవిడ్‌సన్ పతాకాలపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. థ్రిల్లర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 10న విడుదలకు సిద్ధమైంది. సుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠంగా సాగుతుంది. స్క్రీన్‌ప్లే ప్రధాన హైలెట్‌గా రూపొందే ఈ సినిమాలో ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని షాక్‌కు గురిచేస్తాయి. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఓ అమ్మాయి జీవితం ఎలా చిక్కుల్లో పడిందీ అనే కానె్సప్టుతో తెరకెక్కిన చిత్రమిది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామన్నారు. చిత్రానికి సంగీతం:సెల్వగణేశ్ స్వామినాథన్, ఎడిటింగ్:ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి (హైదరాబాద్), జేమ్స్ క్వాన్, రోహిణ్ (యుఎస్‌ఎ) సమర్పణ:టి.సి.ఎస్.రెడ్డి, వెంకట్ వాడపల్లి, నిర్మాతలు:గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్, దర్శకత్వం:అశోక్.జి.