కాటమరాయుడు టైటిల్ సాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా కిశోర్ పార్థసాని (డాలి) దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో టైటిల్‌సాంగ్ చిత్రీకరణ భారీ స్థాయిలో జరుపుకుంటోంది. ఇప్పటికే 80శాతంపైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. త్వరలోనే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తిచేసి ఈ నెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముళ్లుగా శివబాలాజీ, కమల్ కామరాజ్, చైతన్యకృష్ణ, అజయ్‌లు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో రూపొందించిన భారీ సెట్‌లో దాదాపు 400 డాన్సర్లతో పాటను చిత్రీకరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేసి సినిమా విడుదలకు ముందు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. !