గ్లామర్ డోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో గ్లామర్ హీరోయిన్లకే క్రేజ్ ఎక్కువ. నటిగా ఎంత ప్రూవ్ చేసుకున్నా, గ్లామర్ హీరోయిన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శక నిర్మాతలు. అందుకనే చాలామంది హీరోయిన్లు గ్లామర్ దారిలోనే సాగుతుంటారు. ఇప్పుడు అదే దారిలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, మొదట్లో పెద్దగా గ్లామర్ పాత్రలు చేయలేదు. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని క్రేజ్ తెచ్చుకుంది కానీ, అనుకున్నంత ఇమేజ్‌ని దక్కించుకోలేకపోయింది. దాంతో గ్లామర్ డోస్ పెంచి తన సత్తా చాటడానికి సిద్ధమైంది. తాజాగా శర్వానంద్ సరసన ‘రాధ’ చిత్రంలో నటిస్తున్న లావణ్య అందాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని చెబుతున్నాయి యూనిట్ వర్గాలు. ఈ సినిమాతో లావణ్య మంచి ఇమేజ్ దక్కించుకోవడం ఖాయమని అంటున్నారు.

లావణ్య త్రిపాఠి