బ్రేకప్ అయిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ప్రేమాయణాలు ఇవాళ కొత్తేంకాదు. ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్లు ప్రేమల్లో మునిగితేలి సంచలనం సృష్టించిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌లో హాట్ ప్రేమజంటగా ఇమేజ్ తెచ్చుకున్నారు రణ్‌వీర్‌సింగ్-దీపికా పదుకొనె. గత కొన్నాళ్లుగా వీరి వ్యవహారం సాగుతూనే ఉంది. ఏ సందర్భం వచ్చినా ఇద్దరూ సెలబ్రేట్ చేసుకొని సంచలనం సృష్టించడం వారికి కొత్తేమీ కాదు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని బాలీవుడ్‌లో గుసగుసలాడుకుంటున్నారు. కారణం దీపిక హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిజీగా మారింది. దానికితోడు హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విన్ డీజిల్‌తో పిల్లలు కనాలని వుందని దీపిక పదుకొనె చెప్పిన విషయం తెలిసిందే. ఈ సంఘటనల వల్ల రణ్‌వీర్‌కు కావాలనే దూరంగా ఉంటోందని, ఆమెను కలవడానికి రణ్‌వీర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిసింది. రణ్‌వీర్ కూడా దీపిక తనను పట్టించుకోవడం లేదని దగ్గరివారితో బాధ వెళ్లగక్కాడట. దాంతో వీరి వ్యవహారం చెడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

చిత్రం..దీపికా పదుకొనె