నా డబ్బింగ్ అందరికీ నచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో తాను చెప్పిన డబ్బింగ్ అందరికీ నచ్చిందని, భవిష్యత్తులో నటించబోయే చిత్రాల్లో పాత్రను బట్టి ఆలోచిస్తానని, ఈ సినిమాలో మాత్రం విదేశాల్లో వుండే అమ్మాయి పాత్ర కనుక తన డబ్బింగ్ నప్పిందని కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ రూపొందించిన ‘నాన్నకు ప్రేమతో’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్ చిత్ర విశేషాలను తెలిపారు.
జోక్ అనుకున్నా
దర్శకుడు సుకుమార్ తానే ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాలని మొదట అనుకున్నపుడు మొదట జోక్ చేస్తున్నారని అనుకున్నా. ఆ తరువాత మర్చిపోతారులే అనుకున్నా. కానీ ఆయన మర్చిపోలేదు. డబ్బింగ్ టెస్ట్ ఎప్పుడు చేద్దాం అంటూ నన్ను డబ్బింగ్‌కు ఒప్పించారు. లండన్‌లో వుండే అమ్మాయి పాత్ర కాబట్టి నే చెబితే బాగుంటుందని ఆయనే చెప్పడంతో ముందుకొచ్చాను.
చాలా కష్టమయ్యేది
ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. మంచి ప్రతిభ వున్న నటుడాయన. పాటలు చిత్రీకరిస్తున్న సందర్భంలో ఎక్కడా రిహార్సల్స్ అన్నమాటే లేదు. డాన్స్ మాస్టర్ ఎంత క్లిష్టమైన స్టెప్పులు చెప్పినా వెంటనే చేసేద్దామనేవారు. ఆయన స్పీడును అందుకోవడం నాకు చాలా కష్టమయ్యేది. నేను రిహార్సిల్ చేయాల్సి వచ్చినపుడు మాత్రం ఎన్టీఆర్‌ను పక్కన కూర్చోమని అడిగేదాన్ని.
చాలా నేర్చుకున్నాను
మంచి నటులతో కలిసి పనిచేసినపుడు ఎదుటివారి నటన చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ఓ రకంగా ఈ సినిమాలో నేను చేసింది అదే. ఈ చిత్రంలో నా పాత్ర బాగా చేశారని అందరూ అంటున్నారంటే, అది ఎన్టీఆర్, దర్శకుడు సుకుమార్లదే.
45 డిగ్రీస్
ఈ చిత్రానికి సంబంధించిన 45 డిగ్రీస్‌కు సంబంధించిన సన్నివేశం చిత్రీకరణలో నేను, దర్శకుడు సుకుమార్ అనేకసార్లు మాట్లాడుకున్నాం. ఈ సీన్ గురించి చెప్పినపుడు క్లాక్‌వైజా, లేక యాంటీ క్లాక్‌వైజా అని అడిగాను. అందుకే నిన్ను ఈ చిత్రానికి హీరోయిన్‌గా తీసుకున్నానని సుకుమార్ చెప్పారు. ఆ చిత్రీకరణ బాగా వచ్చింది.
కొత్త చిత్రాలు
ఇప్పటివరకూ తెలుగు చిత్రాలపైనే ఎక్కువ శ్రద్ధపెట్టాను. తమిళ చిత్రాల్లో కూడా నటిస్తాను. ప్రస్తుతం కొన్ని చిత్రాలు చర్చల దశల్లో వున్నాయి. సరైనోడు చిత్రంలో నా పాత్ర కొత్తగా వుంటుంది. పల్లెటూరు అమ్మాయిగా మేకప్ లేకుండా నటిస్తున్నాను. నితిన్‌తో కూడా ఓ చిత్రంలో నటిస్తున్నాను. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనలైజ్ కాగానే తెలియజేస్తాను.

-శ్రీ