సెట్‌లోనే సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుభామ అంజలి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదుంది. ఈ అచ్చతెలుగమ్మాయి సంక్రాంతి పండుగ జరుపుకోకుండా ఎలా వుంటుంది? అందుకే, పండగ రోజున ‘పెరంబు’ అనే తమిళ చిత్రం షూటింగ్‌లో వున్నా, అక్కడే ఆ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి ఆమె సంతోషంగా సంక్రాంతి జరుపుకుంది. తను స్వయంగా పొంగలి తయారుచేసి వాళ్లకి రుచి చూపించింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలియజేస్తూ, తాను పొంగలి రెడీ చేస్తుండగా తీసిన ఫొటోను కూడా అభిమానులకోసం షేర్ చేసింది. అంజలికి ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకమని చెప్పాలి. తన కెరియర్లో భారీ చిత్రంగా చెప్పుకునే ‘డిక్టేటర్’ ఈ సంక్రాంతికి విడుదలైంది. అంతేకాకుండా మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందుతున్న ‘పెరంబు’అనే తమిళ చిత్రంలో ఆమె నటిస్తోంది. బిజీగా వుండటంలోను ఆనందం ఉంటుందనే విషయాన్ని ఆమె వ్యక్తంచేసింది.