రజనీ హీరోయిన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం రోబో 2.0 చిత్రంతో బిజీగా ఉన్నాడు రజనీకాంత్. ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ‘కబాలి’ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన పారంజిత్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఈ చిత్రంలో రజని సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకోసం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్‌గా విద్యాబాలన్‌ను తీసుకుంటారని తెలిసింది. బాలీవుడ్‌లో సంచలం రేపిన విద్యాబాలన్ ప్రస్తుతం ‘బేగం జాన్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈమె వేశ్య పాత్రలో కనిపిస్తుండడం విశేషం. ఇక రజనీ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా విద్యాబాలన్‌తో జరిగాయని, ఈ సినిమా చేయడానికి ఆమె ఇంకా ఏ నిర్ణయమూ చెప్పలేదట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. మరి రజనీ సరసన విద్యాబాలన్ నటిస్తే అది మరో సంచలనమే అవుతుంది.