చాలా రోజుల తరువాత మెట్రోతో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరీష్ హీరోగా ఆనంద్‌కృష్ణ దర్శకత్వంలో ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పలు హిట్ చిత్రాల్ని అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజనీ తాళ్లూరి నిర్మించిన మెట్రో చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘చాలా రోజులు తర్వాత మెట్రో సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్నానని, ప్రేమిస్తే, జర్నీ, సలీం తరహాలో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుందని, సినిమాలో కొత్తవాళ్లైనా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారని అన్నారు. మంచి కథ ఉంటే సినిమాల్ని ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారని, దర్శకుడు ఆనంద్‌కృష్ణ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, ఈ సినిమాలో నటించిన శిరీష్ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. దర్శకుడు ఆనంద్‌కృష్ణ మాట్లాడుతూ తన మొదటి చిత్రం తెలుగు, తమిళంలో పెద్ద విజయం సాధించడం ఆనందంగా వుందని, ఈ సినిమా చూసి దర్శకులు మురుగదాస్, గౌతమ్‌మీనన్ అభినందించడం మర్చిపోలేని అనుభూతి అని, చైన్‌స్నాచింగ్ వాస్తవ సంఘటనలను బేస్ చేసుకుని రూపొందించిన కథ ఇదని అన్నారు. ప్రస్తుతం ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని రెడీ చేస్తున్నానని చెప్పారు. హీరో శిరీష్ మాట్లాడుతూ హీరోగా తనకిది మొదటి చిత్రమని, యాక్టింగ్ కోర్సు పూర్తిచేసి ఈ సినిమా చేశానని, మొదటి చిత్రంతోనే మంచి విజయం దక్కడం ఆనందంగా వుందని, నిజానికి మొదట్లో చాలా టెన్షన్ పడ్డానని, కానీ దర్శకుడు ఇచ్చిన సహకారంతో ఈ సినిమాను చేయగలిగానని అన్నారు. ఈ సినిమా తర్వాత రాజారంగీత్ అనే చిత్రంలో నటిస్తున్నానని అన్నారు.