నా పాటలే పాడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో కింగ్ ఆఫ్ మ్యూజిక్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఇళయరాజా అంటేనే సౌమ్యానికి పేరు. ఎప్పుడూ ప్రశాంతంగా వుండే ఆయనకు ఎందుకో కోపమొచ్చినట్టుంది. తన పాటను పాడొద్దంటూ కోర్టు నోటీసులు పంపడం విశేషం. ఆ వివరాల్లోకెళితే తన సొంత ట్యూన్స్ ఇతరులు కాపీ చేస్తుండడంతో ఇళయరాజా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకు తన అనుమతి లేకుండా పాడకూడదని నోటీసులు పంపారు. ఈ విషయంపై స్పందించిన బాలు ఫేస్‌బుక్ ద్వారా తన స్పందనను తెలిపారు. అమెరికాలో నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమాల్లో ఇళయరాజా పాటలు పాడనని, తను పాడిన ఎన్నో పాటలు ఉన్నాయని, వాటిలో కొన్ని పాడతానని బాలు స్పష్టం చేశారు. ‘నాకు ఇళయరాజా దగ్గరనుండి రెండు లీగల్ నోటీసులు అందాయి. అందులో వివిధ దేశాల్లో చిత్ర, చరణ్‌లు నిర్వహిస్తున్న కచేరీల్లో తన పాటల్ని పాడకూడదని అలా చేస్తే కాపీరైట్స్‌ని అధిగమించినందుకుగాను భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వుంటుందని ఆయన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ‘ఎస్పీ బాలు 50’ పేరుతో మా అబ్బాయి ఈటూర్ ప్లాన్ చేశాడు. నేనిప్పటివరకూ రష్యా, మలేషియా, శ్రీలంక, దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లో ఎన్నో కచేరీలు చేశాను. అప్పుడు రాని నోటీసులు అమెరికాలో అనగానే వచ్చాయి. ఆయన చెప్పారు కాబట్టి అమెరికా టూర్‌లో ఆయన పాటల్ని పాడను. కానీ కచేరీ మాత్రం అనుకున్న ప్రకారమే జరుగుతుంది. నేను, నా మిత్రుడు ఇళయరాజాను ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నా’ అని బాలు తన అభిప్రాయాన్ని తెలిపారు.