మంచికథ కనుకే ఆదరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందించిన కంటెంటే సినిమాకు హైలెట్‌గా వుండడంతో ‘నేనోరకం’ సినిమా అందరికీ నచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మంచి సినిమాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ వుంటుందని మరోసారి ఈ చిత్రం రుజువు చేసింది అని నటుడు శరత్‌కుమార్ తెలిపారు. సాయిరామ్ శంకర్, రేష్మిమీనన్ జంటగా విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో శ్రీకాంత్‌రెడ్డి రూపొందించిన ‘నేనోరకం’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుకను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పలువురు సినిమా విజయవంతం అవడానికి గల కారణాలను తెలిపారు. ‘బంపర్ ఆఫర్’ అనంతరం, అంత రేంజ్‌లో తన కెరీర్‌లో ఇంత సక్సెస్ రావడానికి ఐదేళ్ల సమయం పట్టిందని, ఇంత మంచి సినిమాలో హీరో అవకాశమిచ్చినందుకు ఆనందంగా వుందని, మంచి కథాబలం వున్న చిత్రాల్లోనే నటించడానికి నిర్ణయం తీసుకున్నానని నటుడు సాయిరామ్ శంకర్ తెలిపారు. కంటెంటే హైలెట్‌గా సాగుతున్న ఈ చిత్రం వౌత్ టాక్‌తోనే సక్సెస్‌పుల్‌గా సాగుతోందని, రెండవ సగంలో సాయిరామ్ శంకర్, శరత్‌కుమార్‌లమధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌కు థ్రిల్ కలిగిస్తున్నాయని, శరత్‌కుమార్ చేసిన పాత్ర అందరికీ నచ్చిందని దర్శకుడు సుదర్శన్ తెలిపారు. తాము రూపొందించిన తొలి చిత్రాన్ని కమర్షియల్ హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని నిర్మాత శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు మహిత్ నారాయణ, ఉపేంద్‌రెడ్డి, వైవా హర్ష పాల్గొని విశేషాలను తెలిపారు.