మార్చిలో వందో చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతికి ‘డిక్టేటర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే 99 చిత్రాల్లో నటించిన ఆయన తన 100వ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల వార్తలు ఊపందుకున్నాయి. మొత్తానికి బాలయ్య 100వ సినిమాపై క్లారిటీ వచ్చేసింది? సోమవారం ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసినప్పుడు తన 100వ సినిమా విశేషాలను చెప్పినట్టు తెలిసింది. ఆయన 100వ చిత్రంగా ‘ఆదిత్య-999’ను తెరకెక్కిస్తారట. ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా చివరి దశలో ఉందట. వీరిద్దరి కలయికలో ‘ఆదిత్య-369’ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం తెరకెక్కే ‘ఆదిత్య-999’ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.