పాటల్లో ప్రేమలీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్ణువిశాల్, నిక్కీగల్రాణి ప్రధాన తారాగణంగా ఎళిల్ దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన ‘వెల్లైకారన్’ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమలీల పెళ్లిగోల’గా అనువదించారు. మహావీర్ ఫిలింస్ పతాకంపై పారస్ జైన్ తెలుగులో అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. దర్శకుడు వి.వి.వినాయక్ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ- తమిళంలో విష్ణువిశాల్ పేరున్న హీరో అని, హిలేరియస్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇక్కడ కూడా హిట్ అవుతుందన్నారు. మంచి కంటెంట్ వున్న సినిమా ఇదని దర్శకుడు వినాయక్ తెలిపారు. ప్రేమలీల ఒకరిది, పెళ్లిగోల మరొకరిది. అదే ఈ చిత్రంలో ప్రధానాంశమని, మొదట ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నా కామెడీ మిస్ అవుతుందన్న నమ్మకంతో అనువాదం చేశామని, ఈ వేసవికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత పారస్ జైన్ తెలిపారు. తనకిది పదో చిత్రమని, తమిళంలో విజయవంతం అయినట్టుగానే తెలుగులో తొలి విజయం అందుతుందన్న నమ్మకం వుందని కథానాయకుడు విష్ణువిశాల్ తెలిపారు. కార్యక్రమంలో అచ్చిరెడ్డి, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఉమేష్ గుప్తా, పూర్వి వీరరాజు, భరత్‌చౌదరి పాల్గొన్నారు.