త్వరలో వెంకటాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. వేణు దర్శకత్వం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయనున్నారు. శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ.. మా గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం వెంకటాపురం. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. పది లక్షలకు పైగా వ్యూస్ మార్క్ దాటింది. తరువాత విదల చేసిన సాంగ్‌కి కూడా సూపర్ బజ్ వచ్చింది. కథ విషయానికివస్తే ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంది. సరికొత్త కథాంశంతో చేసిన ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. మహిమా మక్వాన్ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని మాత్రం ఈ చిత్రం కల్పిస్తుంది. త్వరలో విడుదలై ప్రేక్షకులని అలరిస్తుందనటంలో ఏమాత్రం సందేహంలేదు అని అన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వెంకటాపురం చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.