యువతరానికి నచ్చే ప్రేమలోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ శ్రీనివాస ఫిలింస్ పతాకంపై ఎస్.పి.నాయుడు నిర్మించిన చిత్రం- ‘ఇదో ప్రేమలోకం’. కరణ్‌రాజ్ స్వీయ రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. సెన్సార్ సహా అన్ని పనులు పూర్తిచేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉంది. ఉగాది తర్వాత రిలీజ్‌కి రెడీఅవుతున్న ఈ సినిమా టీజర్, పోస్టర్‌ని కోడి రామకృష్ణ విడుదల చేశారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ- ‘ఈ తరం చూడాల్సిన చక్కని ప్రేమకథా చిత్రమిది. ప్రేమకథలు ఎప్పుడూ విషాదాంతమే. అలాంటివి చరిత్ర పుటల్లోనూ నిలుస్తాయి. అశోక్‌చంద్ర ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. సుమన్, నరేష్ నటించారు. పాటలు బావున్నాయి. సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ పేరుతేవాలి’ అన్నారు. అశోక్‌చంద్ర, తేజారెడ్డి, సుమన్, నరేష్, భగవాన్, మేల్కొటి, చిట్టిబాబు, ధనుంజయ, మాస్టర్ చంద్రమహేష్, దేవిశ్రీ, ప్రభావతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి పాటలు: టి.కరణ్‌రాజ్- ఎ.కరుణాకర్, చిలకరెక్క గణేష్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: శివ.కె, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: ఎస్.పి.నాయుడు, కథ-కథనం-మాటలు- దర్శకత్వం: టి.కరణ్‌రాజ్.