గోపీకిరణ్ దర్శకత్వంలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ‘కాళిదాస్’, ‘ప్లస్ వన్’, ‘నెంబర్ వన్ స్టూడెంట్’, ‘దాగుడుమూతలు దండాకోర్’ చిత్రాలకు పనిచేసిన రచయిత గోపీకిరణ్ దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. ‘అలె’ కన్నడ చిత్రం విజయవంతమయ్యాక ఆయన తెలుగులో సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముళ్లపూడి మూవీ మేకర్స్, శ్రీ నాగవెంకట సత్యనారాయణ క్రియేషన్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రంలో తేజ్, విష్ణుతేజ విక్టరీ ఉదయ్, ముళ్లపూడి చక్రవర్తి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని 45 రోజులపాటు సింగిల్ షెడ్యూల్‌లో బెంగుళూరు, ఉడిపి, మంగళూరు, కేరళ, ఢిల్లీ, కులుమనాలీలలో షూటింగ్ చేయనున్నారు. ఓ వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న తపనతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని గోపీకిరణ్ తెలిపారు. ధీరుమహేష్, వెంకీ మంకీస్, మేడసాని రంగబాబు, సుమన్‌శెట్టి, గగన్‌వాహిరి, మధుమిత, మమతారాహుల్, సీతల్‌కాలె, పూనమ్‌దూబె, శ్రీ వి, మధువని, సుజాత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శంకు సాయిశ్రీరామ్, నరేష్, కెమెరా: తోట మహీధర్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీకిరణ్.