వేసవికి రానున్న కార్తీక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబకథా చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’. రమణశ్రీ ఆర్ట్స్ పతాకంపై రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి దర్శకుడు. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో టీజర్, ఆడియోలు విడుదల చేయనున్నారు. అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ.. ప్రేమతో మీ కార్తీక్ చిత్రాన్ని దర్శకుడు రిషి అందమైన కథతో అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. కెరీర్, ప్రేమ, కుటుంబాల మధ్య ఉండే సంబంధాల్ని చక్కగా చూపించారు. భలే భలే మగాడివోయ్ తర్వాత మురళీశర్మ అంత అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ చేశారు. గొల్లపూడి మారుతిరావు సంసారం ఓ చదరంగం చిత్రం తరువాత ఆ రేంజి పాత్రలో చేశారు. షాన్ రెహమాన్ అందించిన పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. సినిమాటోగ్రఫీ మరో హైలైట్‌గా ఉంటుంది. కేరళ, కూర్గ్, గోవా, హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో టీజర్‌ని ఆడియోని విడుదలచేసి చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’అని తెలిపారు. కార్తికేయ, సిమ్రత్, మురళీశర్మ, గొల్లపూడి మారుతీరావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘుకారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు. సినిమాటోగ్రఫీ- సాయిప్రకాష్ ఉమ్మడి సింగు ఎడిటర్- మధు రచన, దర్శకత్వం- రిషి.