గ్యాంగ్‌స్టర్‌గా బాలకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా తన్వి ఫిలింస్ పతాకంపై సి.ఆర్.మనోహర్, నిర్మిస్తున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘రోగ్’ (మరో చంటిగాడి ప్రేమకథ). ఈ సినిమాను మర్చి 31న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు. తాజాగా తాను తీస్తున్న చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ పాత్రలో సరికొత్తగా కనిపిస్తారని ఆయన చెబుతున్నారు.
‘రోగ్’ గురించి...
- నేను ప్రేమకథలను చేసి చాలాకాలం అవుతుంది. ఇప్పుడు 31న రానున్న రోగ్ ఓ క్యూట్ లవ్‌స్టోరీ. ఇషాన్ హీరోగా పరిచయం అవుతుంటే, మన్నారాచోప్రా, ఎంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనూప్‌సింగ్ విలన్‌గా పరిచయం అవుతున్నారు. కొత్తవాళ్ళతో చేసిన సినిమా. ఇషాన్‌ను పరిచయం చేస్తున్నప్పుడు లవ్‌స్టోరీ అయితేనే బావుంటుందనిపించింది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. అలాగే హైదరాబాద్, బెంగుళూరుల్లో కూడా సినిమాను చిత్రీకరించాం.
తేడా ఉంది...
- ‘ఇడియట్’- ఓ చంటిగాడి ప్రేమకథ, ‘రోగ్’- మరో చంటిగాడి ప్రేమకథ. ఈ రెండు చిత్రాల్లోని హీరో క్యారెక్టరైజేషన్స్‌కు తేడా ఉంటుంది. ఇడియట్‌లో చంటిగా నటించిన రవితేజ చాలా ఎనర్జిటిక్‌గా, యారగెంట్‌గా ఉంటే, ఈ సినిమాలో చంటిగా నటించిన ఇషాన్ చాలా సైలెంట్‌గా ఉంటాడు.
ఆ ఫీలింగ్‌తో చేస్తాను
- హాలీవుడ్‌లో షాన్‌ఫీల్డ్ అనే గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్ ఉన్నాడు. కొత్త దర్శకులంతా ఆయన రచనలను ఫాలో అవుతుంటారు. ఆయన స్క్రీన్‌ప్లేపై చాలా మంచి పుస్తకం కూడా రాశారు. ఆయన రాసిన రెండు కథలను డైరెక్ట్‌చేస్తే రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. సినిమా మేకింగ్‌కు వచ్చేసరికి మారిపోతుంటుంది. అలాగే నేను కథ రాసుకుని, నిర్మాతలకు, హీరోకు చెప్పినప్పుడు వాళ్లు ఎగ్జయిట్ అయితే సినిమాను చేసేస్తాను. సినిమా చేసే సమయంలో కథను నమ్ముకునే ఓ ఫిలింగ్‌తో వెళ్లిపోతుంటాను. ‘పోకిరి’ సినిమా చేసే సమయంలో ఒక మంచి సినిమా తీస్తున్నానని నమ్మాను కానీ, ఏదో రికార్డులను క్రియేట్ చేసేంత పెద్ద సినిమా అవుతుందని అనుకోలేదు. ఒక సినిమా సక్సెస్ అనేది ఆ సినిమాతోపాటు విడుదలైన వేరే సినిమాలు విడుదల, అప్పటి పరిస్థితులు డిసైడ్ చేస్తాయి. అన్ని సినిమాలు అనుకున్న ఫలితాలు రాబట్టలేవు.
బాలకృష్ణ సినిమా గురించి...
- బాలకృష్ణను నా సినిమాలో కొత్తగా చూపిస్తున్నాను. ఓ గ్యాంగ్‌స్టర్ పాత్ర. చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉండే డైనమిక్ రోల్. ఆయన డైలాగ్స్ కూడా కొత్తగా ఉంటాయి. బాలకృష్ణగారితో ఐదేళ్లక్రితమే సినిమా చేయాల్సింది కానీ కుదరలేదు. ఇప్పటికి సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ కూడా పిక్చరైజ్ చేస్తాం.. సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది.
తదుపరి చిత్రం...
- చిరంజీవి తప్ప, మెగా హీరోలతో సినిమాలు చేశాను. ఇటీవల ఆయన్ను వెళ్లి కలిశాను కూడా. ఇప్పుడు బాలకృష్ణగారితో సినిమా చేస్తున్నాను కదా.. దాని తర్వాత ఏ విషయమనేది నేనే చెబుతాను. అలాగే వెంకటేష్ సినిమా కూడా డిస్కషన్స్ జరిగాయి. తదుపరి ఏ సినిమా అనేది ప్రస్తుతం చేస్తున్న బాలకృష్ణ సినిమా తర్వాతే చెబుతాను.

- శ్రీ