కథ బాగుంటే హీరో ఎవరైనా ఒకటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కొంచెం ఇష్టం- కొంచెం కష్టం’ సక్సెస్‌తో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కిషోర్‌కుమార్ పార్థసాని (డాలీ) తర్వాత ‘తడాకా’ చిత్రంతో మరో హిట్ కొట్టాడు. వెంకటేష్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘గోపాల గోపాల’ సక్సెస్‌తో హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు డాలీ. ఇప్పుడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా, డాలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాటమరాయుడు’ రీసెంట్‌గా విడుదలై విజయం సాధించింది. ఈ సందర్భంగా దర్శకుడు డాలీ మీడియాతో మాట్లాడారు.
* కాటమరాయుడు సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది?
సినిమా విడుదలైన ఆటనుండి హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. శనివారం కాస్త కలెక్షన్స్ తగ్గినట్టు అనిపించినా ఆదివారం మళ్లీ పుంజుకున్నాయి.
* పవన్‌తో రెండోసారి జర్నీ ఎలా ఉంది?
- ‘గోపాల గోపాల’ సినిమా సక్సెస్ తర్వాత పవన్‌కల్యాణ్ మంచి స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసుకోమని చెప్పారు. నేను ‘వీరమ్’ సినిమా చూసినప్పుడు అందులో మంచి లవ్ ఏంగిల్, ఎమోషనల్ పాయింట్ ఉందనిపించి, పవన్‌కల్యాణ్‌కు చెప్పాను. ఆయనకు కూడా చేద్దామని అన్నారు. కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి సినిమా చేశాం. సినిమాలో ప్రధానమైన పాయింట్‌ను అలాగే తీసుకున్నాం. అలాగే ట్రైన్ ఫైట్‌ను యధాతథంగా చేశాం. మొదటి సగంలో వీలైనంతగా మార్చే ప్రయత్నం చేశాం. పవన్‌కల్యాణ్ మాట్లాడుతు కొత్త విషయాలు చెబుతుంటే అదో మర్చిపోలేని ప్రయాణంగా అనిపించింది.
* మక్కికి మక్కి రీమేక్ చేయను
- నేను రీమేక్ చేసిన సినిమాలను గమనిస్తే దేన్ని కూడా మక్కికి మక్కిగా రీమేక్ చేయనని మీకర్థమవుతుంది. కథలో ఓ ప్రేరణ కలిగించే పాయింట్‌ను తీసుకుని, నా స్టయిల్‌లో చేసే ప్రయత్నం చేస్తా.
* కథపై క్లారిటీ కావాలి
- దర్శకుడికి కథపై క్లారిటీ ఉన్నప్పుడు అది అమితాబ్ అయినా, పవన్‌కల్యాణ్ అయినా సులభంగా చేయవచ్చు. ఏ సీన్ ఎలా చేయాలి? అనే క్లారిటీ ఉంటుంది కనుక సినిమా సాఫీగా సాగిపోతుంది. ఈ చిత్రం కూడా అలాగే సాగిపోయింది.
* పవన్‌కల్యాణ్ పాత్రకు స్పందన ఎలా ఉంది?
- పవన్‌కళ్యాణ్ నటన బాగుందని, సినిమా చూసిన ప్రతివారు చెబుతున్నారు. ముఖ్యంగా లవ్ సీన్స్‌లో కెమిస్ట్రీ పండించారని అన్నారు. ఇంతకుముందు సినిమాల్లో చూడని విధంగా పవన్‌కల్యాణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ సరికొత్తగా చేసే ప్రయత్నం జరిగింది.
**
- యు

- యు