క్రిష్.... మణికర్ణికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన క్రిష్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా మరో బయోపిక్ నేపథ్యంలో చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆయన చేసే సినిమా తెలుగులోకాదు బాలీవుడ్‌లో. ఫైర్‌బ్రాండ్‌గా ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి ఆయన ఝాన్సీలక్ష్మిభాయ్ కథతో సినిమా రూపొందించే పనిలో పడ్డాడు. ఈ సినిమాకు కథను అందించే పనిలో ఉన్నాడు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్. ఈ సినిమాకు ‘మణికర్ణికా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.