ఆసిన్ పెళ్లికూతురాయెనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి ఆసిన్, మైక్రోమాక్స్ సహవ్యవస్థాపకుడు రాహుల్‌శర్మల వివాహం అత్యంతవైభవంగా జరిగింది. దిల్లీకి సమీపంలోని దుసిట్ దేవరాణ హోటల్‌లో మంగళవారం ఉదయం వారిద్దరూ ఓ ఇంటివారయ్యారు. ఉదయం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం చేసుకున్న ఈ దంపతులు సాయంత్రం హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. ప్రఖ్యాత డిజైనర్ సవ్యసాచి ముఖర్జి రూపొందించిన దుస్తులతో వధూవరులు అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వివాహవేడుకకు, వారికి అత్యంత ఆప్తులైన అక్షయకుమార్, ట్వింకిల్‌ఖన్నాతోపాటు అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులుమాత్రమే హాజరయ్యారు. పదిఅంచెల్లో రూపొందించిన వెనీలా కేక్‌తోపాటు పూర్తి శాఖాహార వంటకాలనే విందులో పెట్టారు. ఈనెల 23న ముంబైలో అట్టహాసంగా నిర్వహించే విందుకు దక్షిణాది, బాలీవుడ్ చిత్రప్రముఖులను ఆహ్వానించనున్నారు. దక్షిణాదిన ఓ వెలుగువెలిగిన ఆసిన్ ఆ తరువాత అమీర్‌ఖాన్‌తో కలిసి ‘గజిని’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత అద్భుతమైన నటనతో చాలాసినిమాల్లో నటించారు. అక్షయ్‌కుమార్ దంపతులు బ్రాండ్ అంబాసిడర్‌గా మైక్రోమ్యాక్స్‌కు వ్యవహరించినపుడు రాహుల్‌శర్మ, ఆసిన్‌ల పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికోసం ఆసిన్ గత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంది. కాగా ఆమె వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్‌లో స్వయంగా ఆసిన్ పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.