లోకరక్షకుని ‘తొలి కిరణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సువర్ణా క్రియేషన్స్ పతాకంపై కె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన చిత్రం ‘తొలి కిరణం’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జాన్‌బాబు మాట్లాడుతూ, లోకరక్షకుడైన ఏసు మరణించిన తరువాత మూడో రోజు సమాధినుండి తిరిగి లేచాక 40 రోజులు భూమిమీద నడయాడారని, అపుడు జరిగిన అద్భుతాలను ఏ సినిమాలో చిత్రీకరించలేదని, క్రీస్తు 40 రోజులు ఏం చేశారు? ఎవరెవరిని కలిశారు? మానవాళికి ఏ సందేశం ఇచ్చారు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని మతాలవారికి నచ్చుతుందని, పాటలు అద్భుతంగా కుదిరాయని, క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన పాటలు అందరికీ నచ్చాయని ఆయన అన్నారు. క్రీస్తు పాత్రలో పి.డి.రాజు చక్కగా నటించారని ఆయన అన్నారు. త్వరలో ఆడియో విడుదల చేసి సినిమాను గుడ్‌ఫ్రైడే కానుకగా మార్చి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సుధాకర్ తెలిపారు. భానుచందర్, ఆర్.పి.పట్నాయక్, చంద్రబోస్ తదితరులు చిత్ర విశేషాలు తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు:రెవరెండ్ టి.ఎ.ప్రభుకిరణ్, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: మురళీకృష్ణ, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: టి.సుధాకర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.జాన్‌బాబు.