గ్లామర్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదట్లో ఎగుడు దిగుడు బాటలో కెరీర్ సాగినా ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రీచాఛద్దా ఇప్పుడు టాప్ స్టార్‌గా వెలుగొందుతోంది. అటు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది అంటే రీచా అవకాశాల వెంబడి పడడం కన్నా ఆమె వెనుకా అవకాశాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తున్న ఆమె తాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటానని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న స్టార్‌డమ్ దృష్ట్యా మరింత అందంగా కనిపించడానికి, అవకాశాలను ఒడిసిపట్టడానికి సెక్సీ ఫొటో షూట్లు చేసేస్తూ హాట్ హాట్ అందాలను ఆరబోస్తోంది. అందమైన ఆమె ఫొటోలను చూసి బాలీవుడ్‌లో సైతం కంగారెత్తిపోతున్నారట. బికినీ, స్లీవ్‌లెస్ లాంటి ఎలాంటి దుస్తులనైనా ఏ మాత్రం అభ్యంతరం లేకుండా వేసేస్తూ, కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తానంటోంది. ప్రస్తుతం ఔర్ దేవ్‌దాస్, కేబరెట్, లవ్ సోనియా, ఫక్రి-2 చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు తర్వాత తన స్టార్‌డమ్ మరింత పెరుగుతుందన్న ఆశాభావంతో రోజురోజుకూ గ్లామర్‌ను పెంచుకుంటూ పోతోంది. చూద్దాం..