అతని సరసన..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగా వస్తున్న హీరోయిన్లు ఏదొక సపోర్ట్ దొరికేంతవరకూ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఎదుర్కోవాల్సిందే. ఒక్కసారి ఏదో ఒక గుర్తింపు వచ్చింది అంటే, కెరీర్‌లో మంచి చిత్రాలుగాని పడ్డాయి అంటే గాడిలో పడుతుంది. అయితే ఈ గుర్తింపు వచ్చేది ఎలా? అంటే కొత్తగా వస్తున్న కథానాయికలందరూ ఏదొక రాగాన్ని అందుకొని ఆలపిస్తుంటారు. తాజాగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యామీనన్ తనదో సెపరేట్ లెక్క అంటోంది. ఏకంగా తమిళ హీరో ఆర్యతోనే మాటల కెరటాలను సృష్టిస్తోంది. అతనంటే తనకు చాలా ఇష్టమని, కాలేజీ డేస్ నుంచే అతన్ని చూస్తూ పెరిగాననీ, ఇప్పుడు కథానాయికగా ప్రయత్తిన్నాస్తున్నాను కనుక అతని సరసన అవకాశం వస్తే ఒక్క పైసా లేకపోయినా నటిస్తానంటూ ఓ స్టేట్‌మెంట్ పడేసింది. కేవలం మాట మాత్రమే కాదండోయ్.. తన వంతు సందేశం కూడా సదరు హీరోకి పంపించేసింది ఐశ్వర్యామీనన్. మొత్తానికి ఓ ధైర్యమైన పనిచేసినట్లే ఆమె! చూద్దాం. ఈ కొత్త లెక్క ఎంతవరకు ఆన్సర్ ఇస్తుందో!