మూడు చిత్రాలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ‘దృశ్యకావ్యం’ చిత్రాన్ని రూపొందించిన దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పుష్యమి ఫిలిం మేకర్స్ ఫిలిమ్స్ పతాకంపై అందిస్తున్న తెలుగు చిత్రం ‘్భరవ’. విజయ్, కీర్తిసురేష్ జంటగా భరతన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సంతోష్ నారాయణ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, అలాగే రాజ్‌తరుణ్, జై, అంజలి, జెమినీ అయ్యర్ ప్రధాన తారాగణంగా శనీష్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘బెలూన్’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం కొడైకెనాల్‌లో జరుపుతున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూలై నెలాఖరుకు విడుదల చేస్తామని తెలిపారు. అదే విధంగా విక్రమ్, నయనతార ప్రధాన తారాగణంగా హరి దర్శకత్వంలో సామి-2 చిత్రాన్ని ఈ సంవత్సరం చివరిలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ మూడు చిత్రాలను ఈ సంవత్సరం తమ సంస్థ ద్వారా విడుదల చేయడం ఆనందదాయకమని ఆయన అన్నారు.