డామిట్.. అసలొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినాకైఫ్ రణబీర్‌కపూర్‌తో విడిపోయాక నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. ఒకప్పుడు హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన ఈ ఇద్దరు అటు తెరముందే కాక, ఇటు తెర వెనుక కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పుడు రణబీర్‌కపూర్ తనకు దూరమవ్వడంతో కత్రినా కత్తులు నూరుతోంది. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా రణబీర్‌కపూర్‌పై కారాలు, మిరియాలు చల్లుతోంది. దాంతో పక్కనున్న దర్శక నిర్మాతలకు కూడా నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న జగ్గాజాసూస్ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలలో కత్రినా కరాళ నృత్యం చేస్తోంది. ట్రైలర్‌లో వారిద్దరి కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు ఆదరిస్తుంటే, అది గుర్తించలేని కైఫ్ ఆ ట్రైలరే బాగాలేదంటూ చెబుతోంది. పోస్టర్లలో కూడా కత్రినా రణబీర్‌తో లిప్‌లాక్ చేసిన ఫొటోలను పెట్టవద్దంటూ హూంకరిస్తోంది. అలా పోస్టర్లు లేకపోతే సినిమాకి మరింత గుర్తింపు రాదని దర్శక నిర్మాతలు ఎంత బతిమాలినా ససేమిరా అంటోందట. భవిష్యత్‌లో సినిమా విడుదలయ్యాక ఎటువంటి ప్రమోషన్స్‌కు తాను రానని ఖరాఖండిగా చెబుతోందట. మొత్తానికి ఈ సినిమా చుట్టూ ఇన్ని వివాదాలున్నా దర్శక నిర్మాతలు మాత్రం జూలై 14న విడుదల చేస్తామంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. అప్పటి దాకా కత్రినా ఇంకా ఏం చేస్తుందో చూడాల్సిందే.