భరత్ అను నేను?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 23వ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెలతో షూటింగ్ పూర్తికానుంది. ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ సినిమా తరువాత మహేష్ నటించే 24వ చిత్రం కోసం అప్పుడే సన్నాహాలు ఊపందుకున్నాయి. శ్రీమంతుడు లాంటి సంచలన విజయాన్ని అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం మేలో షూటింగ్ ప్రారంభం కానుందట. ఫారిన్‌లోనే ఓ షెడ్యూల్‌ని నిర్వహిస్తారని తెలిసింది. దేశభక్తి అంశం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంకోసం ‘్భరత్ అను నేను’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే యూనిట్ నుంచి అధికారికంగా సమాచారం రావాల్సి వుంది. భిన్నమైన కథనాలతో చిత్రాలను తెరకెక్కించే కొరటాల శివ రూపొందిస్తున్న నాల్గవ చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమాపై ఫిలిమ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ భామను దించుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ ఎన్‌ఆర్‌ఐగా కనిపిస్తాడని తెలిసింది.