డూప్ లేకుండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటినుంచి చేస్తున్న సినిమాలపై చాలా సీరియస్‌గా దృష్టిపెట్టింది అందాల భామ త్రిష. ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ఈమెకు ‘నాయకి’ సినిమా కాస్త గట్టిదెబ్బే కొట్టింది. అయినా అదే సంకల్పంతో ఎన్‌హెచ్-10, గర్జెనై, మోహిని చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కావడం విశేషం. ముఖ్యంగా ఎన్‌హెచ్-10 చిత్రంలో ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, అందుకోసం త్రిష బాగానే కష్టపడుతోందని, ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో ఎలాంటి డూప్‌లు వాడకుండా స్వయంగానే చేస్తోందట. దర్శకుడు వద్దని వారించినా కూడా ఫరవాలేదు రిస్కీ స్టంట్స్‌ను నేనే చేస్తానని పట్టుబట్టి మరీ చేస్తోందట. మొత్తానికి త్రిష డేర్ చూస్తుంటే మళ్లీ తన హవా చాటుకోవడానికి బాగానే కష్టపడుతున్నట్టుంది.