పొలిటికల్ పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య సినిమాలపై బాగా దృష్టిపెట్టింది అందాల భామ త్రిష. దశాబ్దకాలంపాటు గ్లామర్ భామగా సౌత్‌లో హవా సృష్టించిన ఈమెకు ఈమధ్య కాస్త కెరీర్ డల్ అయింది. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ సెలక్టివ్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలు విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్న త్రిష ఈసారి పొలిటికల్ లీడర్‌గా నటిస్తోంది. తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పిన మహిళా నేతగా కనిపిస్తుందని తెలిసింది. ఈ పాత్రను త్రిష చేయడంతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆ మహిళా నేత ఎవరనేది సస్పెన్స్‌గా వుంది. ఇటీవలే ‘నాయకి’గా హారర్ సినిమాతో భయపెట్టడానికి రెడీ అయిన ఈ భామ ఇప్పుడు పొలిటికల్ లీడర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధవౌతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ధనుష్ నిర్మిస్తుండడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుందని సమాచారం.