కింగ్స్ లోగో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినయ్‌రాయ్, సాక్షీ చౌదరి, స్వస్తిక జంటగా శరన్ దర్శకత్వంలో ఆర్.కె. ఫిలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ నిర్మిస్తున్న ‘కింగ్స్’ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శరన్ మాట్లాడుతూ, ఇదొక మంచి ఫాంటసీ ఎంటర్‌టైనర్. సూర్యగ్రహణం రోజున పుట్టిన ఇద్దరు కవల పిల్లలు బద్ధశత్రువులుగా మారడమనే మంచి కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇదన్నారు. ఆర్.కె.గౌడ్ ప్రతీ విషయంలో సపోర్టు అందిస్తున్నారన్నారు. హీరో వినయ్ మాట్లాడుతూ, తాను నటించిన సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో విడుదలయ్యాయని, తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తారని, ఇందులో రెండు పాత్రలు చేస్తున్నానని చెప్పారు. ‘వాన’ సినిమాతో తనకు మంచి గుర్తింపునిచ్చారని, కొంత గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా ఇది అన్నారు. నిర్మాత ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ, వెంకటేశ్‌తో ‘జెమిని’ వంటి చిత్రాన్ని రూపొందించిన శరన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సింగపూర్, బ్యాంకాక్‌లో రెండు షెడ్యూళ్లు పూర్తిచేసుకుందని, ఫిబ్రవరి మొదటివారంలో మరో షెడ్యూల్ జరపనున్నామన్నారు. దాంతో షూటింగ్ పూర్తవుతుందని, అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, సింగపూర్‌లో తెలుగు సినిమా షూటింగ్‌లకు మంచి అనువైన ప్రదేశమని, అక్కడ 40 శాతం షూటింగ్ చేస్తే సబ్సిడీలు అందిస్తున్నారన్నారు. దాంతోపాటు సింగపూర్‌కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ చైనాలో 2వేల మినీ థియేటర్లను నిర్మించిందని, ఆ కంపెనీతో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని, రెండు తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.