పాటల కథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజిత్, అర్చన జంటగా సాయికిరణ్ ముక్కామల దర్శకత్వంలో మాంత్రిక్ మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన ‘కథనం’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సీడీని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ చాలా బాగుందని, టైటిల్‌తోపాటు ట్యాగ్‌లైన్ కూడా నచ్చిందని అన్నారు. అందరి జీవితాల్లో కథ ఉంటుందని, దేవుడు అందరితో ఫుట్‌బాల్ ఆడుతుంటాడని, అందరి సరదా తీర్చేది ఆయనేనని, పాటలు బావున్నాయని, సినిమా మంచి హిట్ కావాలని అన్నారు. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, కొత్తదనంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మంచి హిట్ కావాలన్నారు. దర్శక నిర్మాత సాయికిరణ్ మాట్లాడుతూ, ఈ సినిమాలోని కథను ఎవరూ ఊహించని విధంగా సాగుతుందన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ, రంజిత్ ఈ సినిమాతో హీరోగా నటిస్తున్నాడని, తను వృత్తిపరంగా డాక్టర్ అయినా కూడా సినిమాల మీద ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించాడన్నారు. ఈ చిత్ర టీమ్ అందరికీ మంచి విజయం దక్కాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రంజిత్, పరచూరి వెంకటేశ్వరరావు, నాగినీడు, అర్చన తదితరులు పాల్గొన్నారు.