కార్తీతో ఐటెంగర్ల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ భామ స్కార్లెట్ మెలిష్ విల్సన్ -కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాతో సౌత్‌లో అడుగుపెట్టింది. పవన్ సరసన తళుక్కుమన్న మహత్యంతో వరుస ఆఫర్లు దక్కించేసుకున్న స్కార్లెట్, బాహుబలి ది బిగినింగ్‌లోనూ ఐటెం సాంగ్ ఆఫర్ పట్టేసింది. అంతేకాదు రామ్‌చరణ్ మూవీ ‘ఎవడు’లో ‘అయ్యో పాపం’ అంటూ అలరించిన అనుభవమూ స్కార్లెట్‌కు ఉంది. ఇలయ దళపతి విజయ్ మూవీ ‘జిల్లా’లోనూ మెరిసిన స్కార్లెట్ విల్సన్, ఇప్పుడు కార్తి హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంటే, స్కార్లెట్ ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుందని టాక్. ఇప్పటికే ఈ బ్రిటీష్ భామ స్పెషల్ సాంగ్‌ను రాజస్థాన్‌లోని జైసల్మీర్ కోటలో షూట్ చేస్తున్నారట. గిబ్రాన్ అందించిన సూపర్ బీట్‌కు ఆడిపాడుతున్న స్కార్లెట్, తొలిసారిగా అందమైన కోటలో షూటింగ్ చేస్తున్నందుకు తెగ సంబరపడిపోతోంది. పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్న బృందంపై ప్రశంసల వర్షం కురిపించిన స్కార్లెట్ ‘ఈ మహిళ నాకు చాలా నచ్చేసింది. ఇలాంటి కొరియోగ్రఫితో వర్క్ చేయడం నా అదృష్టం’ అనేసింది. ధీరన్ అధిగారం ఒండ్రు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చతురంగ వేట్టైం ఫేం హెచ్ వినోద్ దర్శకుడు.