నమో వేంకటేశాయ అంటున్న నాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంక్రాంతి పండక్కి సోగ్గాడిగా అలరించిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన తదుపరి చిత్రం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈసారి మళ్లీ భక్తి సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నటించిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడీ సాయి’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో ఇప్పుడు మరో భక్తి సినిమాను తెరకెక్కించేందుకు దర్శకేంద్రుడు సమాయత్తమవుతున్నాడు. కలియుగ దైవం వేంకటేశ్వరుని కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే రాఘవేంద్రరావు నాగార్జునకు కథ కూడా చెప్పారని, లైన్ బాగా నచ్చడంతో చేయడానికి ఆయన ఓకె చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమా వేంకటేశ్వరస్వామి భక్తుడిగా వుంటుందా లేదా భగవంతుడి పాత్రతో వుంటుందా అనేది తెలియాల్సి వుంది. ఈ చిత్రానికి ‘నమో వేంకటేశాయ’ అనే టైటిల్‌ను పెడుతున్నట్టు రాఘవేంద్రరావు ఓ కార్యక్రమంలో తెలిపారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి రానుందని ఆయన స్పష్టం చేశాడు.