కొత్త టైటిల్‌తో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సిలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తరువాత హ్యట్రిక్ చిత్రంగా రూపొందుతున్న సినిమా టైటిల్‌పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాకు ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్ ప్రచారంలో వున్న సంగతి తెలిసిందే. తరువాత ఇంజనీరు బాబు అనే పేరు కూడా వినిపిస్తోంది. ఈ టైటిల్‌తో ఓ ఫ్యాన్‌మేడ్ పోస్టర్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదికాకుండా తాజాగా పరదేశి పారాయణం అనే పేరు కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా విదేశాల్లో సెటిలవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే ఈ టైటిల్ అనుకుంటున్నట్టు టాక్! మరి ఈ పేర్లపై ఖచ్చితమైన క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకూ వేచి చూడాల్సిందే! కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రంలో మాజీ కథానాయిక ఖుష్బూ ఓ కీలకమైన పాత్రలో నటిస్తుండటం విశేషం!